బలహీనవర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్(BJP OBC Morcha national president Laxman) విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ(OBC morcha state executive committee meeting) సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)తో కలిసి ఆయన(BJP OBC Morcha national president Laxman) పాల్గొన్నారు.
40సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబం దేశాన్ని పాలించి.. బీసీలకు అనువైన ఒక్క నిర్ణయం తీసుకోలేదు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది కాంగ్రెస్ పార్టీ. కులాల వారీగా బంధు డిమాండ్ చేయాల్సిన అవసరం ఓబీసీ మోర్చా మీద ఉంది. -లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు
బీసీల వర్గీకరణ కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం జస్టిస్ రోహిణీ కమిషన్ ఏర్పాటు చేశారని లక్ష్మణ్(BJP OBC Morcha national president Laxman) అన్నారు. ఈ ఏడాది 70వేల మంది ఓబీసీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల్లో అవకాశం దక్కిందని చెప్పారు. 52మంత్రిత్వ శాఖలు, 300కు పైగా ప్రవేశపెట్టిన పథకాల అమలుకు ఓబీసీ మోర్చా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు.