తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ పండుగ.. తెలంగాణ మహిళలకే ప్రత్యేకం: లక్ష్మణ్ - laxman participated in batukamma celebrations

ప్రకృతిని మనం పరిరక్షిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

bjp leader laxman on batukamma celebrations
బతుకమ్మ సంబురాల్లో భాజపా నేత లక్ష్మణ్

By

Published : Oct 17, 2020, 6:47 AM IST

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసమే ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ ఏకైక రాష్ట్రం తెలంగాణ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రతి ఏడులాగే ఈ ఏడు అంగరంగ వైభవంగా బతుకమ్మను జరుపుకునేలా ప్రస్తుత పరిస్థితులు లేవని, మహిళలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ జరుపుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఈనెల 19న దిల్లీలో ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details