భాజపా ప్రభంజనానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే పునారవృతం అవుతాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ తెలిపారు. దుబ్బాక, మధ్యప్రదేశ్ ఉప ఎన్నిక, బిహార్ ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపొందిన సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ భాజపా క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్
భాజపా ప్రభంజనానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే పునారవృతం అవుతాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అభివృద్ధికి పాటుపడుతున్న విధానాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పే.. దుబ్బాక, మధ్యప్రదేశ్ ఉప ఎన్నిక, బిహార్ ఎన్నికల ఫలితాలని ఆయన పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను కాపాడడంలో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధికి పాటుపడుతున్న విధానాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పే ఎన్నికల ఫలితాలు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కమలం పార్టీకి అనుకూల వాతావరణం నెలకొందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్