సమాజంలోని నిరుపేదలను ఆదుకోవాలని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యకర్త నిస్వార్థంగా సేవ చేస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వ్యాధి కారణంగా విధించిన లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజల ఆకలి తీర్చడానికి పార్టీ శ్రేణులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 100 పేద కుటుంబాలకు భాజపా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లంపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు సరకులు పంపిణీ చేసిన భాజపా నేత లక్ష్మణ్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 100 పేద కుటుంబాలకు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రజాసేవ చేయడంలో భాజపా ముందంజలో ఉందని ఆయన అన్నారు. రాజకీయాలకతీతంగా పార్టీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
bjp leader laxman groceries distribution
నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ముగ్గురికి చొప్పున నిత్యావసర సరకులు, అన్నదానం చేయాలని ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసేవ చేయడంలో భాజపా ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఆపత్కాల సమయంలో పార్టీ శ్రేణులు అంకితభావంతో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకతీతంగా విపత్కర సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని లక్ష్మణ్ సూచించారు.
ఇవీ చూడండి: పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు