రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియాలు నడుస్తున్నాయని భాజపా నేత లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయటమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. మజ్లిస్ నేతలు తప్ప ప్రతిపక్ష, సొంత పార్టీ నేతలు కూడా సీఎంను కలవలేని పరిస్థితి నెలకొని ఉందని వెల్లడించారు.34శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి పరిమితం చేశారని...ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
స్థానిక పోరులో బీసీలకు అన్యాయం: లక్ష్మణ్ - రాష్ట్రంలో బారు-బీరు ఏరులైపారుతోంది: లక్ష్మణ్
రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా డబ్బు మయం అయ్యాయని భాజపా నేత లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్కు నచ్చితే చాలన్నట్లు వ్యవహారం సాగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లల్లో అన్యాయం చేస్తున్నరని ఆరోపించారు.
భాజపా కార్యాలయంలో మాట్లాడుతున్న లక్ష్మణ్