పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ వైఫల్యం చెందారని... హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడానికి ప్రభుత్వమే కారణమని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్‌కు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని... అందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు రావాలని దిల్లీలో సవాల్ విసిరారు. భాజపా క్రమంగా విస్తరిస్తోందని.. అది తట్టుకోలేకే మంత్రి కేటీఆర్ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ విఫలం: లక్ష్మణ్ - తెరాసకు సవాల్ విసిరిన భాజపా నేత లక్ష్మణ్
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌పై భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని దిల్లీలో ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రోడ్లు, నాలాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రోడ్లు, నాలాల నిర్వహణ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు తెరాస ప్రయత్నిస్తోందని విమర్శించారు. జాతీయ రహదారుల మరమ్మతుల కోసం కేంద్రం రూ.రెండున్నర వేల కోట్లు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్య కట్టడికి రూ.117 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. కరోనా వేళ రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల రుణం అందించిందని వివరించారు.
ఇదీ చదవండి:రూ.313.65 కోట్ల వ్యయంతో లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్