తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ విగ్రహం ఏది, భవనం ఎక్కడ..?: లక్ష్మణ్​

హైదరాబాద్​ లోయర్​ ట్యాంక్​ బండ్​లోని అంబేడ్కర్​ భవనం వద్ద భాజపా నేత లక్ష్మణ్​ నిరసన చేపట్టారు. 125 అడుగుల ఎత్తైన విగ్రహం, అత్యాధునిక భవనం ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటతప్పారని మండిపడ్డారు.

By

Published : Jul 4, 2019, 5:12 PM IST

అంబేడ్కర్​ విగ్రహం, భవనం ఎక్కడ..?: లక్ష్మణ్​

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కేసీఆర్​ మాటతప్పారని ధ్వజమెత్తారు. హైదరాబాద్​ లోయర్ ​ట్యాంక్​ బండ్​లోని అంబేడ్కర్​ భవన్​ వద్ద భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్​ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్​ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి మూడున్నర సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టలేదని నిలదీశారు. నూతన అసెంబ్లీ, సచివాలయం పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అంబేడ్కర్​ విగ్రహం, భవనం ఎక్కడ..?: లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details