తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​కు​ ప్రజలు సహకరించాలి: కె.లక్ష్మణ్​ - bjp latest news

దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని భాజపా నేత కె.లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్​ గౌలిగూడలో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావుతో కలిసి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

bjp leader laxman distribution groceries in hyderabad
లాక్​డౌన్​కు​ ప్రజలు సహకరించాలి: కె.లక్ష్మణ్​

By

Published : Apr 10, 2020, 4:07 PM IST

హైదరాబాద్ బేగంబజార్ కార్పోరేటర్ శంకర్‌యాదవ్ నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు భాజపా నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని లక్ష్మణ్ కోరారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్​ను కట్టడి చేసేందుకు సమర్ధవంతంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details