తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరేళ్లు పూర్తయినా... 40వేలకు మించి నిర్మాణాలు జరగలే' - laxman comments on double bed room houses

తెరాస ప్రభుత్వం ఆరేళ్లలో కనీసం 40వేల డబుల్ బెడ్​రూం ఇళ్లను కూడా కట్టలేకపోయిందని దుయ్యబట్టారు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్​లో పేదలను మభ్యపెట్టి జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో తెరాస లబ్ధిపొందిందని ఆరోపించారు.

'ఆరేళ్లు పూర్తయినా... 40వేలకు మించి నిర్మాణాలు జరగలే'
'ఆరేళ్లు పూర్తయినా... 40వేలకు మించి నిర్మాణాలు జరగలే'

By

Published : Sep 22, 2020, 4:42 PM IST

రాష్ట్రంలో 2 లక్షల 63 వేల రెండు పడకల గదుల ఇళ్లను నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి ఆరేళ్లు పూర్తైనా... 40 వేలకు మించి నిర్మాణాలు జరగనట్లు తెలుస్తోందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. హైదరాబాద్​లో పేదలను మభ్యపెట్టి జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో తెరాస లబ్ధిపొందిందని దుయ్యబట్టారు.

నియోజకవర్గానికి 4 వేలు అని చెప్పి ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తీరా చూస్తే 631 కట్టారని అందులో 430 మందికి కేటాయించినట్లు తేల్చారన్నారు. లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 631 మాత్రమే కట్టడం.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్ధంపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేయాలని చిత్తశుద్ధితో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.

ఇదీ చూడండి: ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details