తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంత ఖరీదైన ఎన్నికలు దేశంలో ఎక్కడా జరగలేదు' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తాజా వార్త

అధికార తెరాస విపరీతంగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ భాజపా మాత్రమేనని చెప్పారు.

bjp leader lakshman talks on municipal election results
'ఇంత ఖరీదైన ఎన్నికలు దేశంలో ఎక్కడా జరగలేదు'

By

Published : Jan 25, 2020, 7:40 PM IST

ఎన్నికల్లో అధికార తెరాస విజయం దొడ్డిదారిన సాధించినదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. తెరాస ఎంతో ఖర్చు చేసిందని... ఇంత ఖరీదైన ఎన్నికలు దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. ఇప్పటికైనా ఫలితాలు భాజపాకు సానుకూలంగానే వచ్చాయన్నారు. చాలా మున్సిపాలిటీల్లో తెరాస మ్యాజిక్ ఫిగర్‌ సాధించలేదని... కేటీఆర్‌ ఇలాఖాలోనే తెరాసకు ఫలితాలు ఏమాత్రం బాగాలేవని ఎద్దేవా చేశారు. భాజపా ఎక్కడుందో సిరిసిల్లలో చూస్తే కేటీఆర్‌కు అర్థమవుతుందన్నారు. సంక్షేమ పథకాలు బాగుంటే తెరాస ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టిందని ప్రశ్నించారు.

ముున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక పెడితే బాగుండేదన్నారు. ఆరోపణలు వచ్చిన తెరాస నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్​ ప్రశ్నించారు. తెరాస కూడా మజ్లిస్‌తో కలిసి బరిలోకి దిగిందని తెలిపారు. తాము పోరాడింది రాజకీయ పార్టీలతోపాటు అక్రమంగా డబ్బు సంపాదించిన తెరాస మాఫియాతోనూ కూడా అని లక్ష్మణ్​ అన్నారు.

'ఇంత ఖరీదైన ఎన్నికలు దేశంలో ఎక్కడా జరగలేదు'

ఇదీ చూడండి: బెదిరించి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి గెలిచారు: రేవంత్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details