ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా నియమించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా.... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇలా వ్యవహరించడం రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపర్చటమే అవుతుందని వ్యాఖ్యానించారు. రమేశ్ కుమార్‌ను విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్‌గా మీరు జోక్యం చేసుకుని ఆయన్ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా చూడాలని లేఖలో కోరారు.
ఎస్ఈసీగా రమేశ్ కుమార్ కొనసాగింపుపై గవర్నర్‌కు కన్నాలేఖ - kanna laxmi narayana wrote letter to governor on sec issue
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ...గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
ఎస్ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్‌కు కన్నాలేఖ