ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొందరు భాజపా కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. ఈ దాడులపై స్థానిక పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా పుంజుకుంటోదనే భయంతో... కమలం పార్టీ కార్యకర్తలను కిడ్నాప్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ కీలుబొమ్మలా తయారైంది: నల్లు ఇంద్రసేనారెడ్డి - muncipal elections 2020
పుర ఎన్నికల్లో భాజపా పుంజుకుంటుందనే భయంతో కొందరు తెరాస నేతలు కమలం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా తయారైందని విమర్శించారు.
ఎన్నికల కమిషన్ కీలుబొమ్మలా తయారైంది: నల్లు ఇంద్రసేనారెడ్డి
అధికార బలంతో కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కీలు బొమ్మగా తయారైందని విమర్శించారు. ఇప్పటికైనా కమిషన్ మేల్కొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కబ్జాలమయం నిజాంపేట కార్పొరేషన్