గత ప్రభుత్వాలు రాష్ట్రంలో భూములను కాపాడుకుంటూ వస్తే సీఎం కేసీఆర్ మాత్రం విలాసాల కోసం వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని... భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. భవిష్యత్ తరాలకు నష్టం చేసే హక్కు ఎవరికీ లేదని... ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు అమ్మడం సరికాదన్నారు.
'విలాసాల కోసమే ప్రభుత్వ భూముల అమ్మకం' - హైదరాాబాద్ తాజా వార్తలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను అమ్మడం సరికాదని... భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెప్పారని... అంతలోనే ఆర్థికంగా కుదేలైందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో భూములను కాపాడుకుంటూ వస్తే సీఎం కేసీఆర్ మాత్రం వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదన్న భాజపా నేత ఇంద్రసేనారెడ్డి
ప్రభుత్వం భూముల అమ్మకాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను ప్రభుత్వం రికవరీ చేసేంత సామర్థ్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా అవసరాల కోసం భూములు దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు ఉన్న భూములను అమ్మితే భవిష్యత్లో ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్