సికింద్రాబాద్ అల్వాల్లో సాయి పాండమిక్ టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో భాజపా నేత గరికపాటి మోహన్రావు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి పేదలకు అండగా నిలుస్తోన్న బృందాన్ని అభినందించారు.
'కరోనా ఆపత్కాలంలో పేదలకు అండగా నిలవాలి' - groceries distribution in secundrabad
లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సాయి బృందానికి భాజపా నాయకులు గరికపాటి మోహన్రావు అభినందనలు తెలిపారు.

'కరోనా ఆపత్కాలంలో పేదలకు అండగా నిలవాలి'
ప్రతి ఒక్కరు ఈ బృందాన్ని స్ఫూర్తి తీసుకుని కరోనాపై కలిసి పోరాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని గరికపాటి విజ్ఞప్తి చేశారు.