తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు డీకే అరుణ బహిరంగ లేఖ - సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన భాజపా నేత డీకే అరుణ

ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బహిరంగ లేఖ రాశారు. నడిగడ్డ ప్రాంత ప్రజలకు సీఎం హోదాలో ఇచ్చిన హామీలను ఆయన వెంటనే నెరవేర్చాలని కోరారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు తక్షణమే మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

DK Aruna wrote an open letter to the CM and KCR
సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన భాజపా నేత డీకే అరుణ

By

Published : Jun 4, 2021, 8:03 PM IST

జోగులాంబ గద్వాల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం బాధకరమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నడిగడ్డ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ.. కేసీఆర్​కు ఆమె బహిరంగ లేఖ రాశారు.

నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు వైద్య కళాశాలలను సీఎం మంజూరు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు కూడా వెంటనే మెడికల్ కాలేజీని మంజారు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ABOUT THE AUTHOR

...view details