రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని... అందులో భాగంగానే దుబ్బాక గెలుపు అని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ని గద్దె దించడానికి ప్రజలు ఇచ్చిన మొదటి తీర్పు అని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా... ప్రజలు వారిని నమ్మలేదని తెలిపారు. దుబ్బాక అభివృద్ధిపై చూపిన వివక్షని ప్రజలు అర్థం చేసుకున్నారని వెల్లడించారు.
కేసీఆర్ను గద్దె దించడానికి ఇచ్చిన తొలి తీర్పు: డీకే అరుణ
దుబ్బాకలో భాజపా గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యాలయాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఈ విజయంపై డీకే అరుణ స్పందించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ... కేసీఆర్ని గద్దె దించడానికి ఇచ్చిన తొలి తీర్పు ఇది అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ని గద్దె దించడానికి ఇచ్చిన తొలి తీర్పు: డీకే అరుణ
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేదని డీకే అరుణ అన్నారు. ప్రస్తుతం అందరూ భాజపా వైపే చూస్తున్నారని... రాష్ట్రంలో భాజపా అధికారాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దుబ్బాక విజయం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. దుబ్బాకలో భాజపా గెలుపుతో హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సంబురాలు అంబరాన్నంటాయి.
ఇదీ చదవండి:కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు
Last Updated : Nov 10, 2020, 5:19 PM IST