దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో పేదల అవసరాన్ని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కరోనా రహిత భారత్ కోసం ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
Dk aruna: కరోనా రహిత భారత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారు..
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తుందని ప్రధాని ప్రకటించడం హర్షణీయమని డీకే అరుణ కొనియాడారు. కరోనా రహిత భారత్ కోసం ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
Dk aruna: కరోనా రహిత భారత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారు..
చిన్నారులకు టీకా కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిపారు. తక్కువ సమయంలోనే దేశీయంగా రెండు టీకాలను భారత్ అభివృద్ధి చేసి అగ్ర దేశాలకు తీసిపోమని కేంద్ర ప్రభుత్వం నిరూపించిందన్నారు. కొవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు టీకా వేసుకోవాలి.. లేకుంటే