తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు: డీకే అరుణ - కవిత లిక్కర్‌ స్కాం విచారణపై డీకే అరుణ వ్యాఖ్యలు

DK Aruna about CBI investigation on Kavitha: తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. చట్టం తనపని తాను చేస్తుందని.. చట్టాన్ని పని చేయనివ్వాలని కోరారు.

DK Aruna
DK Aruna

By

Published : Dec 11, 2022, 6:17 PM IST

DK Aruna about CBI investigation on Kavitha: ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణపై పలు పార్టీల నేతలు స్పందించారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు.

తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని డీకే అరుణ అన్నారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రంలో పోలీసులు, అధికార వ్యవస్థను వాడుకుంటున్నారని ఆక్షేపించారు. ఎమ్మెల్యేలుగా కనీస గుర్తింపు లేని వాళ్లు సీఎం కేసీఆర్ మెప్పుకోసం ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చట్టం తనపని తాను చేస్తుందని.. చట్టాన్ని పనిచేయనివ్వాలని డీకే అరుణ కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details