తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ వివాదం: దత్తాత్రేయ అరెస్ట్​ - inter board

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అరెస్టును నిరసిస్తూ ట్యాంక్​బండ్​పై భాజపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నాకు అనుమతులు లేవని వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అరెస్టు

By

Published : Apr 30, 2019, 12:07 PM IST

ఇంటర్​ ఫలితాల్లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భాజపా కార్యకర్తలు ట్యాంక్​బండ్​పై అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టిన భాజపా కార్యకర్తలతో పాటు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details