రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాపై గవర్నర్ తమిళిసై స్పందించడాన్ని భాజపా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. గవర్నర్ స్పందనపై సీఎం సానుకూలంగా స్పందించకుండా తమ భజనపరుల చేత రాజకీయంగా ఎదురుదాడి చేయించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'కరోనా మీద స్పందించిన గవర్నర్‌పై విమర్శలు చేస్తారా...?' - governor tamilisai response on corona
రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తోన్న కరోనాపై స్పందించిన గవర్నర్‌పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయటం సరికాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. గవర్నర్ స్పందనను తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు.
bjp laxman welcomed governor response on corona
రాష్ట్రంలో కొవిడ్- 19 విజృంభించడంపై హైకోర్టు అనేక పర్యాయాలు మొట్టికాయలు వేసినా... తమకు పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావించడంపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల చేత గవర్నర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.