ముఖ్యమంత్రి కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి కంటే ముందు కేసీఆర్ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని విమర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణమన్నారు. యదాద్రిలో ఆధ్యాత్మికతను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. యాదాద్రిలో జరుగుతున్న అపచారంపై సీఎం వివరణ ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
'లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణం' - bjp laxman serious comments on trs government latest news
తెరాస ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
bjp laxman serious comments on trs government today news
మంత్రి కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. చింతమడకకు కేంద్రం ఎంత ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తుందని లక్ష్మణ్ అన్నారు.
ఇవీ చూడండి:రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్
Last Updated : Dec 4, 2019, 10:05 PM IST