రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అవినీతి మయమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఇందుకు గాంధీ ఆసుపత్రి డాక్టర్ ఆరోపణలే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 వైరస్ నివారణకు భాజపా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 వైరస్‌పై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆయన మండిపడ్డారు.
'ఆరోగ్య శాఖ అవినీతిమయం.. అభద్రతలో ప్రజలు'
రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఆసుపత్రులు కట్టిస్తానన్న సీఎం కేసీఆర్...ఇప్పుడున్న ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని దుయ్యబట్టారు.
Bjp Laxman serious comments on telangana state health department