రబీ రైతులకు రైతుబంధు కింద రూ.5,100 కోట్లు విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అనేక నెలలుగా రైతులందరికీ రైతుబంధు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఇంకా చాలా మంది అన్నదాతలకు ప్రభుత్వ సాయం అందలేదన్నారు.
రైతు బంధు జీవోను స్వాగతిస్తున్నాం కానీ.. - రైతు బంధు జీవోను స్వాగతిస్తున్నాం కానీ..
రైతు బంధు పథకం కింద రూ.5,100 కోట్లు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పుర పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు ముందుగా జీవో ఇవ్వడాన్ని తప్పుబట్టారు.
రైతు బంధు జీవోను స్వాగతిస్తున్నాం కానీ..
ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. పురపాలక ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జీవో ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలు మేధావులని, ఆలోచించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిలోదాకాలివ్వడం ఇది మొదటిసారి కాదని విమర్శించారు. అవకాశవాద, మోసపూరిత రాజకీయాలకు కేసీఆర్ పెట్టింది పేరని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఇవీచూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు
TAGGED:
laxman fires on cm kcr