ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా... చేతలు గడప దాటడం లేదని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆక్షేపించారు. తెలంగాణ ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధి, పింఛను మొత్తాలను చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు సంస్థలు కోట్లు గడిస్తుంటే ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కూరుకుపోతుందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం భాజపా పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకొచ్చి ప్రజల బాధలు పట్టించుకోవాలన్నారు. ఇప్పటి వరకూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ముఖ్యమంత్రి పాలనాదక్షతను తెలియజేస్తుదని విమర్శించారు.
'కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావాలి' - bjp
రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.... రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు.
ముఖ్యమంత్రిపై కె.లక్ష్మణ్ విమర్శలు