అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాల తరబడి వివాదాస్పదమైన అయోధ్య సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపిందనందుకు హర్షం వ్యక్తం చేశారు. విశ్వాసాలను కాకుండా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 2019 నవంబర్ 9 చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు.
"అయోధ్యపై సుప్రీం తీర్పు భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం" - BJP LAXMAN on ayodhya case Supreme Court judgment
అయోధ్య తీర్పు తర్వాత దేశ ప్రజలు చూపిన సహనం, సంయమనం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అన్నివర్గాల ప్రజలు గౌరవించడం శుభపరిణామమని తెలిపారు.
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: లక్ష్మణ్
జమ్మూ కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం నరేంద్ర మోదీ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఓవైసీకి దారుసలాం తప్పితే కోర్టుల పట్ల అవగాహనలేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ తాడు ప్రభుత్వానికి ఉరి తాడవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలన హిట్లర్‌ను తలపిస్తోందని... నియంత పాలన ఎక్కువ రోజులు మనుగడలో ఉండదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఇవీచూడండి: 'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం
TAGGED:
BJP LAXMAN on ayodhya case