భాజపాలో చేరికలు ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతాయని, వాటికి అంతం లేదని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నేత కొత్త కాపు రవీందర్ రెడ్డి తన అనుచరులతో సహా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు.
"తెరాస నేతలు అభద్రతా భావంతో ఉన్నారు' - లక్ష్మణ్
తెరాస పార్టీ నీటి బుడగలాంటిదని అది ఎప్పుడైనా మునిగి పోవచ్చని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
"తెరాస పార్టీ నీటి బుడగ లాంటిది"
మంత్రి ఈటల మనోవేదన తెరాస పార్టీ తీరును బహిర్గత పరిచిందని లక్ష్మణ్ అన్నారు. తెరాసలోని మంత్రులు ఎమ్మెల్యేలు అంతర్లీనంగా అభద్రతా భావంతో నలిగి పోతున్నారని తెలిపారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగర వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 9 నుంచి బడ్జెట్ సమావేశాలు