ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల భుజాల మీద తుపాకీ పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చుతున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ సంఘాలు ఎక్కడ మద్ధతు ఇస్తాయోనన్న భయంతో పీఆర్సీని తెరపైకి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రైతుబంధు, రుణమాఫీ పథకాలను బంద్ చేశారని ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. లక్ష్మణ్ సమక్షంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకులు భాజపాలో చేరారు.
'ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' - ts news
ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులను సర్కారు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
'ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'