BJP Kishan Reddy reacts on Election Results : కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పోరులో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి తమ పార్టీ చరిత్ర సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డి(Kishan reddy) పేర్కొన్నారు. వెంకట రమణారెడ్డి అయిదేళ్ల పోరాటమే ఈ ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. కామారెడ్డి ఫలితం పట్ల జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసిందన్నారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ముందు దోషిగా నిలబడిన కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్‌కు వెళ్లారని పేర్కొన్నారు.
'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'
Telangana BJP Latest News : గత శాసన సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి వంద శాతం ఓటింగ్ పెరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపేనని తెలిపారు. బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై అనేక పోరాటాలు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని అక్కడి ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెట్టారన్నారు. మధ్యప్రదేశ్‌లో తమ అధికారాన్ని కాపాడుకున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల సరళి, ఇక్కడున్న పరిస్థితులను జాతీయ నాయకత్వానికి వివరిస్తానని తెలిపారు.