BJP Kishan reddy in Loksabha Elections Preparatory Meeting : ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) మూడోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) పేర్కొన్నారు. సర్వేలన్ని కూడా నరేంద్రమోదీకి ఎవరూ దరిదాపుల్లో లేరని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నరేంద్రమోదీనే మరోసారి ప్రధాని కావాలని ఎక్కడ చూసినా చర్చ జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు : కిషన్‌రెడ్డి
బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.
"ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేలన్ని కూడా నరేంద్రమోదీకి ఎవరూ దరిదాపుల్లో లేరని స్పష్టం చేస్తున్నాయి. దేశాన్ని అనేక మంది పరిపాలించారు. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉంది. కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ చెబుతున్నాయి కిషన్‌రెడ్డి BJP Latest News :పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ఎంపీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. ఇంఛార్జీలుగా 8 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ స్థానానికి ఇంఛార్జీగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే
- ఆదిలాబాద్ - పాయక్ శంకర్
- పెద్దపల్లి - రమారావు పాటిల్
- కరీంనగర్ - ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
- నిజామాబాద్ - ఏలేటి మహేశ్వరరెడ్డి
- జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
- మెదక్ - పాల్వాయి హరీశ్‌బాబు
- మల్కాజ్‌గిరి - పైడి రాకేష్ రెడ్డి
- సికింద్రాబాద్ - కె.లక్ష్మణ్
- హైదరాబాద్ - రాజాసింగ్
- చేవెళ్ళ - ఏవీఎన్ రెడ్డి
- మహబూబ్‌నగర్ - రామచంద్రరావు
- నాగర్‌కర్నూల్ - మాగం రంగారెడ్డి
- నల్లగొండ - చింతల రామచంద్రా రెడ్డి
- భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి
- మహబూబాబాద్ - గరికపాటి మోహనరావు
- ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న రావచ్చు : కిషన్‌రెడ్డి