హైదరాబాద్లోని బషీర్ బాగ్ వ్యవసాయ కమిషనరేట్ ముందు భాజపా కిసాన్ మోర్చా నాయకులు ఆందోళన నిర్వహించారు. రైతులతో కలిసి లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయాలంటూ నినదించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
KISAN MORCHA: భాజపా కిసాన్ మోర్చా ఆందోళన ఉద్రిక్తం.. - కిసాన్ మోర్చా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
బషీర్ బాగ్ వ్యవసాయ కమిషనరేట్ ముందు భాజపా కిసాన్ మోర్చా నాయకులు నిర్వహించిన ఆందోళనలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు.
పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట.. ఇద్దరికి గాయాలు
విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళకారులకు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. అరెస్ట్ చేసిన కిసాన్ మోర్చా నాయకులు, అధ్యక్షులను నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి:పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేం: హైకోర్టు