సమాజానికి నిర్మాణాత్మక సేవలందిస్తున్న పాత్రికేయులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ భేటీ అన్నారు. సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రామ్ నగర్లో పాత్రికేయులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా యువ మోర్చా గ్రేటర్ అధ్యక్షుడు శివాజీ, భాజపా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ - భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ భేటీ
హైదరాబాద్ రామ్‌నగర్‌లో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ భేటీ పాత్రికేయులకు నిత్యావసర సరుకులను అందజేశారు. బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.
![పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ bjp kisan morcha distributed daily commodities to journalists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:05:01:1622018101-tg-hyd-38-26-bjp-kisan-grocereys-pampini-ab-ts10017-26052021135110-2605f-1622017270-983.jpg)
పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఇంతటి విపత్కర సమయంలో కూడా పాత్రికేయులు... ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, కరోనా నిబంధనల గురించి తెలియజేయడం గొప్ప విషయమని శివాజీ అన్నారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైందని, వారిని అందరూ గౌరవించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'