దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి పని చేయాలని భారతీయ జనతాపార్టీ, జనసేన నిర్ణయించాయి. 2024లో అధికారమే లక్ష్యంగా అన్ని అంశాల్లో ఐక్యంగా వెళ్లాలని అభిప్రాయపడ్డాయి. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. విజయవాడలో జరిగిన భేటీలో ఇరు పార్టీల నేతలు పలు అంశాలపై చర్చించారు.
భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం - pawan kalyan latest news
దేశ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి పని చేయాలని భారతీయ జనతాపార్టీ, జనసేన నిర్ణయించాయి. 2024లో అధికారమే లక్ష్యంగా అన్ని అంశాల్లో ఐక్యంగా వెళ్లాలని అభిప్రాయపడ్డాయి. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి.
![భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం bjp-](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5730468-821-5730468-1579168569483.jpg)
bjp-
భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం
ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని తీర్మానించాయి. రైతుల ఆందోళనకు అండగా నిలవాలని నిర్ణయించాయి. వైకాపా, తెదేపాను సమదూరంలో ఉంచాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ పరస్పర సహకారంతో పోటీ చేయనున్నారు.
భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం
ఇరుపార్టీలు తరచుగా సమావేశం కానున్నారు. రెండు పార్టీల సమన్వయం కోసం ఓ కమిటీ ఏర్పాటుకూ అంగీకరించారు. రాజధాని, ఇతర అంశాల్లో వైకాపా, తెదేపా పనితీరుపైనా సమావేశంలో చర్చ సాగింది.