తెలంగాణ

telangana

ETV Bharat / state

రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు

ఏపీలో భాజపా-జనసేన నాయకులు తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రను.. పోలీసులు భగ్నం చేశారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా.. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లేందుకు సిద్ధమైన భాజపా శ్రేణులను పోలీసులు.. ఎక్కడికక్కడ నిర్బంధించారు.

రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు
రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు

By

Published : Jan 5, 2021, 4:55 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లేందుకు సిద్ధమైన భాజపా శ్రేణులను పోలీసులు.. ఎక్కడికక్కడ నిర్బంధించారు. రామతీర్థం జంక్షన్‌ వరకూ వెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకుని... నెల్లిమర్ల పోలీస్టేషన్‌కు తరలించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

తెదేపా, వైకాపా నేతలను కొండపైకి అనుమతించిన ప్రభుత్వం.. తమను ఎందుకు అడ్డుకుంటోందో సీఎం సమాధానం చెప్పాలని.. భాజపా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు.. జనసేన నేతలను కూడా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు

ఇదీ చదవండి:50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details