తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay on Rohit Reddy: ఎవరికి పడితే వారికి స్పందించను: బండి - రోహిత్‌రెడ్డిపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay on Rohit Reddy: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్‌ బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో భాజాపా ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో బషీర్‌బాగ్ జగ్జీవన్ రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదానికి పుట్టినిల్లయిన పాకిస్తాన్ నేతలు.. భారత్‌ ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

BANDI
BANDI

By

Published : Dec 17, 2022, 2:30 PM IST

ఎవరికి పడితే వారికి స్పందించను: బండి

Bandi Sanjay on Rohit Reddy: హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భాజపా నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బషీర్‌బాగ్ జగ్జీవన్ రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి మీర్జా బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ తీశారు. ర్యాలీలో బండి సంజయ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, గౌతమ్‌రావు, రాణి రుద్రమ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. పైలెట్ రోహిత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను బండి సంజయ్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఎవరికి పడితే వారికి స్పందించనని బండి సంజయ్ మీడియాతో వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్ జరగకుండా ఉండాలంటే పాకిస్తాన్ జాగ్రతగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాద దేశాల పట్ల యువత, ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈ ఉదయం డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్‌కి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెల్లడించారు. నోటీసులు రాలేదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నా అని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details