తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలపై పోరాడేందుకు భాజపాను గెలిపించండి : రాంచందర్​ రావు - సికింద్రాబాద్​లో లాలాపేట్​లో భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు భాజపాను గెలిపించాలని ఎమ్మెల్సీ రాంచందర్​ రావు కోరారు. రంగారెడ్డి-హైదరాబాద్​-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ లాలాపేట్​లోని కార్తీక గార్డెన్​లో నియోజకవర్గ స్థాయిలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

bjp graduate mlc election compaign in at lalapet in secunderabad
సమస్యలపై పోరాడేందుకు భాజపాను గెలిపించండి : రాంచందర్​ రావు

By

Published : Feb 7, 2021, 9:02 PM IST

ప్రజా సమస్యలపై తన గొంతును వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు కోరారు. నిరుద్యోగుల సమస్యలపై తన గళాన్ని మరింత వినిపించేందుకు భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్ కార్తీక గార్డెన్​లో భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని రాంచందర్​ రావు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ రెండేళ్లుగా యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా పాలనను గాలికొదిలేసిందన్నారు. తెరాస మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుండా పట్టభద్రులను మోసం చేస్తోందని మండిపడ్డారు. మేధావులందరూ ఆలోచించి భాజపాకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఎల్.రమణ

ABOUT THE AUTHOR

...view details