తెలంగాణ

telangana

ETV Bharat / state

72 ఏళ్ల  సమస్యను పరిష్కరించాం: రాంమాధవ్​ - bjp general secretary rammadhav speak about article 370

జమ్మూ కశ్మీర్‌ను 72 ఏళ్లుగా వేధిస్తోన్న సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ 72 గంటల్లో పరిష్కరించారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భాజపా ఆధ్వర్యంలో జరిగిన ఆర్టికల్‌ 370పై  జన జాగరణ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాంమాధవ్​

By

Published : Oct 4, 2019, 11:55 PM IST

హైదరాబాద్‌లోని భాజపా ఆధ్వర్యంలో ఆర్టికల్‌ 370పై జన జాగరణ సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌ను 72 ఏళ్లుగా వేధిస్తోన్న సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ 72 గంటల్లో పరిష్కరించారని తెలిపారు. కాశ్మీర్‌ ప్రజలకు స్వేచ్ఛా వాయువులిచ్చామన్నారు. కాశ్మీర్‌ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాముడు, ఏకే.ఖాన్‌, చంద్రవదన్‌, పద్మనాభయ్య, ఐవైఆర్​ పాల్గొన్నారు.

72 ఏళ్ల సమస్యను పరిష్కరించాం: రాంమాధవ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details