తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల్లో పార్టీ ప్రచారం కోసం బీజేపీ 'విస్తారక్​' - తెలంగాణ భారతీయ జనతా పార్టీ

BJP Vistaraks Gets Bikes in Telangana : తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే విస్తారక్​లను నియమించింది. అయితే వీరికి తాజాగా ద్విచక్రవాహనాలు అందజేయాలని యోచిస్తోంది.

BJP, Modi, TS BJP
BJP gears up speed

By

Published : Mar 18, 2023, 6:54 PM IST

BJP Vistaraks Gets Bikes in Telangana : ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. దక్షిణాదిలోనూ ఎలాగైనా పాగా వేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మిగతా రాష్ట్రాల్లోనూ పగ్గాలు చేపట్టాలని ఎదురు చూస్తోంది. సౌత్​లో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలో రావటానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా ముందకు సాగుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకవైపు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. మరోవైపు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికే ఆ పార్టీ విస్తారక్​లను నియమించగా .. తాజాగా వారికి ద్విచక్ర వాహనాలు అందించాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతి ఎంపీ స్థానానికొక బైక్ చొప్పున మొత్తం 17 ద్విచక్ర వాహనాలను జాతీయ నాయకత్వం పంపించింది.

నియోజ‌క‌వ‌ర్గానికి ఒక బైక్ :త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ ద్విచక్ర వాహానాలను అందించనున్నారు. ఆయా లోక్ సభ స్థానాల్లో ఏర్పాటు చేసిన విస్తారక్​లకు వీటిని ఇవ్వనున్నారు. ఈ వాహనాల్లో ఒక ప్రత్యేక కిట్ ఏర్పాటు చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల బ్రోచర్లు ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ప‌త్రాలూ ఉంటాయి. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ వాహ‌నాలతో వారు నిత్యం ప్రజల్లో తిరిగేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

పార్టీ బ‌లోపేతంపై ప్ర‌ధాన దృష్టి: అంతేకాకుండా పార్టీని అసెంబ్లీ, మండల, గ్రామ, బూత్ స్థాయిల్లో బలోపేతం చేయడంపైనా విస్తారక్​లు దృష్టిసారించనున్నారు. బూత్ కమిటీల నియామకంతో పాటు మండల కమిటీలు, శక్తి కేంద్రాల వారీగా సమీక్షించాల‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఏదైనా ఒక పార్లమెంట్ పరిధిలో సమావేశాలు, సభలు నిర్వహించినా నేతల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ బాధ్యతలనూ వీరు నిర్వ‌ర్తిస్తారు.

నిత్యం పర్యటనలు చేస్తూ లోటు పాట్లను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలో వారి పర్యటనలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ వాహ‌నాల కొనుగోలు జ‌రిగినట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఈ వాహ‌నాలు రాష్ట్ర పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే వీటిని విస్తారక్​ల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అవ‌స‌ర‌మైతే.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 119 ద్విచక్ర వాహనాలను సైతం తీసుకువచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

నేను అన్నది తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషే: బండి సంజయ్‌

ఐపీ అడ్రస్‌లను మార్చి కంప్యూటర్‌లోకి చొరబడ్డ టీఎస్​పీఎస్​సీ నిందితులు

ABOUT THE AUTHOR

...view details