BJP Formation Day: దేశవ్యాప్తంగా నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం తెలంగాణ రాష్ట్ర శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30నిమిషాలకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం వర్చువల్ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలను ఉద్ధేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ధ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
BJP Formation Day: దేశవ్యాప్తంగా నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - telangana news
BJP Formation Day: నేడు దేశవ్యాప్తంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జెండాను ఎగురవేయనున్నారు.
రాష్ట్ర శాఖతో పాటు మహంకాళి సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అమీర్ పేట్‌లోని ప్రముఖ హోటల్‌లో మోదీ ప్రసంగాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు జాతీయ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. అనంతరం సత్యం థియేటర్ నుంచి శోభాయాత్ర సనత్ నగర్‌లోని హిందూ పబ్లిక్ స్కూల్ వరకు నిర్వహించనున్నారు. హిందూ పబ్లిక్ స్కూల్ వేదికగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: Governor Delhi Tour: నేడు అమిత్‌షాతో గవర్నర్ భేటీ.. ఆ అంశాలు చర్చించే అవకాశం..!