కరోనా వైరస్ నియంత్రణ కోసం దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును... భాజపా శ్రేణులు హైదరాబాద్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇవాళ రాత్రి 9గంటల నుంచి 9నిమిషాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో విద్యుత్ నిలిపి వేసి... దీపాలు వెలిగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
'ఆ సమయానికి అందరూ ఇంటిలో విద్యుత్ నిలిపివేయండి' - భాజపా నాయకుల ఆహార పంపిణీ
వైరస్ నియంత్రణలో భాగంగా నేడు దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలపును భాజపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను సైతం అందిస్తున్నారు.
!['ఆ సమయానికి అందరూ ఇంటిలో విద్యుత్ నిలిపివేయండి' bjp-food-distribution-at-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668012-thumbnail-3x2-bjp.jpg)
'ఆ సమయానికి అందరూ ఇంటిలో విద్యుత్ నిలిపివేయండి'
'ఆ సమయానికి అందరూ ఇంటిలో విద్యుత్ నిలిపివేయండి'
భాజపా నాయకులు రామన్ గౌడ్, నర్సింగ్ యాదవ్ నారాయణగూడ విఠల్ వాడీలో నిత్యం పని చేసుకునే కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఆకలితో అలమట్టిస్తున్న వారికి రోజు మధ్యాహ్నం భోజనం, బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీచూడండి:సహాయం చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి: సజ్జనార్