నాగార్జున సాగర్ ఉపఎన్నికపై భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కసరత్తు ముమ్మరం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. అభ్యర్థి ఎంపికపై కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతోన్నారు. తెరాస తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే భాజపా అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
నాగార్జునసాగర్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు - telangana varthalu
నాగార్జున సాగర్ ఉపఎన్నికపై కమలదళం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై భాజపా నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే సాగర్ టికెట్‌పై పలువురు బండి సంజయ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థి ఎంపికపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు
బండి సంజయ్‌ను కలిసి టికెట్ కేటాయించాలని కడారి అంజయ్య యాదవ్‌తో పాటు పలువురు ఆశావాహులు కోరారు. దశాబ్ద కాలంగా పార్టీని భుజాలపై మోస్తోన్న తమకే టికెట్ కేటాయించాలని కంకణాల నివేదితారెడ్డి దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సాగర్ టికెట్‌పై బండి సంజయ్ నుంచి ఆశావాహులకు ఎలాంటి హామీ లభించలేదు.
ఇదీ చదవండి: 'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదు: భాజపా