తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ స్థానాలకు ఇంఛార్జీలను నియమించిన బీజేపీ - 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు - Lok Sabha Elections 2024

BJP Focus on Lok Sabha Elections 2024 : బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. ఇంఛార్జీలుగా 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది.

BJP on Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 2:14 PM IST

BJP Focus on Lok Sabha Elections 2024 :రాష్ట్ర బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి రాష్ట్ర ఇంఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. మెజారిటీ సీట్లు గెలుపే లక్ష్యంగా వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై చర్చించారు. పార్టీ ఎల్పీ నేత ఎన్నికపైన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

పార్లమెంట్‌ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం - రేపు, ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలు

BJP Parliament Elections Preparatory Meeting :బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. ఇంఛార్జీలుగా 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ స్థానానికి ఇంఛార్జీగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఆదిలాబాద్ - పాయక్ శంకర్
  • పెద్దపల్లి - రమారావు పాటిల్
  • కరీంనగర్ - ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
  • నిజామాబాద్ - ఏలేటి మహేశ్వరరెడ్డి
  • జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణరెడ్డి
  • మెదక్ - పాల్వాయి హరీష్ బాబు
  • మల్కాజ్‌గిరి - పైడి రాకేష్ రెడ్డి
  • సికింద్రాబాద్ - కే.లక్ష్మణ్
  • హైదరాబాద్ - రాజాసింగ్
  • చేవెళ్ళ - ఏవీఎన్ రెడ్డి
  • మహబూబ్‌నగర్ - రామచంద్రరావు
  • నాగర్‌కర్నూల్ - మాగం రంగారెడ్డి
  • నల్లగొండ - చింతల రామచంద్రారెడ్డి
  • భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  • వరంగల్ - మర్రి శశిధరరెడ్డి
  • మహబూబాబాద్ - గరికపాటి మోహనరావు
  • ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి

లోక్​సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ - వెన్నుపోటుదారులకు చెక్​ పెట్టాలని నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details