తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా ఫైర్​ - భాజపా నాయకులు

తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం అంశంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో హిందువులు మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. కారకులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కోరుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం

By

Published : Aug 23, 2019, 1:51 PM IST

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై వేరే మత ప్రచారంపై తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని..., హిందువుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణసూచించారు.

అన్యమత ప్రచారానికి కారకులైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని... కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. బాధ్యులైన వారిని భక్తుల ముందు నిలబెట్టాలని కోరారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై తెలంగామ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.... అన్యమత ప్రచారం విషయం సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.... తప్పుచేసిన వారిపై సీఎం చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ కోరారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా ఫైర్​

ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

ABOUT THE AUTHOR

...view details