మునుగోడులో బోగస్ ఓట్లు నమోదయ్యాయని భాజపా ఆరోపించింది. ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. తక్కువ సమయంలోనే మునుగోడులో 25 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపించింది. ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనుంది. లిస్ట్ ప్రకటించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు విన్నవించింది. ఈ రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది.
మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా - munugode bypoll
మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా
12:09 October 11
మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా
Last Updated : Oct 11, 2022, 12:33 PM IST