తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదోడికి అన్యాయం చేస్తే భాజపా ఊరుకోదు: మోత్కుపల్లి - Telangana news

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాయినగర్, రసూల్​పురాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదులను భాజపా, అఖిలపక్ష నాయకులు సందర్శించారు. వెంటనే ఇళ్ల పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

'పేదోడికి అన్యాయం చేస్తే భాజపా ఊరుకోదు'
'పేదోడికి అన్యాయం చేస్తే భాజపా ఊరుకోదు'

By

Published : Jan 2, 2021, 5:17 PM IST

పేదోడికి అన్యాయం జరుగుతుంటే భాజపా చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాయినగర్, రసూల్​పురాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదులను భాజపా, అఖిలపక్ష నేతలతో కలిసి మోత్కుపల్లి సందర్శించారు.

రెండు పడకల గదులు కట్టించడానికి 5 సంవత్సరాలు కూడా సరిపోలేదు... కానీ ప్రగతి భవన్​ కేవలం 6నెలలోనే వందల కోట్లు వెచ్చించి కట్టించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదప్రజల జీవితాలతో అడుకుంటున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి నెలలోపు అర్హులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... పేద ప్రజలను ఎంత అవమానపరుస్తున్నాడో ఇళ్లను చూస్తే అర్థమవుతోంది. కేసీఆర్... ఒక్కపూట ఇందులో పడుకో నీకు అర్థమైతది. ఈ ఇళ్లు జానేడు ఇంటిలో మూరెడు కట్టె ఉన్నట్టు ఉన్నాయి. అర్హులకే ఇళ్లు ఇవ్వాలి. బయటివాళ్లకు ఇస్తే ఊరుకునేది లేదు.

--- మోత్కుపల్లి నర్సింహులు, భాజపా నేత

ఇదీ చూడండి:తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ.. చూస్తూ ఊరుకోం: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details