తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP on Double Bedroom Houses : రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు - BJP dharna to give double bedroom houses to people

BJP Dharna on Double Bedroom Houses : రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలంటూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో కమలం నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అర్హులందరికి రెండు పడక గదుల ఇళ్లు వెంటనే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రేపు ఇందిరాపార్కు వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

BJP
BJP

By

Published : Jul 24, 2023, 4:30 PM IST

BJP Dharna on Double Bedroom Houses in Telangana : రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పోరుబాట పట్టింది. మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప వద్దకు బయలుదేరిన కమలం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

హనుమకొండ కలెక్టరేట్ వద్ద చేపట్టిన బీజేపీ నేతలు చేపట్టిన.. ఆందోళన కార్యక్రమంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో వాడవాడల బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులందరికి ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 57 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని.. కుటుంబంలో అర్హులైన వారందరికి పింఛను ఇస్తామని ఈటల రాజేందర్ వివరించారు.

"రాష్ట్రంలో వాడవాడల బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే 57 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తాం. కుటుంబంలో అర్హులైన వారందరికి పింఛను ఇస్తాం." - ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

BJP Dharna on Double Bedroom Houses : నిజామాబాద్‌ ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. రెండు పడక గదుల ఇళ్లు పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సీఎంగా ఉంటే రెండు పడక గదుల ఇండ్లు రావని విమర్శించారు. పేదల కోసం కట్టిన ఇండ్లు కూలిపోతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో 3,000 ఇళ్లకు ఆర్థిక సాయం అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లోని నిధుల్లో రూ.10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కవితకు నిధులు ఇస్తే లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టారని మండిపడ్డారు. తన తల్లిదండ్రులను తిడితే.. తాను కవితను తిట్టకుండా ఊరుకోవాలా అని అర్వింద్ ప్రశ్నించారు.

"కేసీఆర్‌ సీఎంగా ఉంటే రెండు పడక గదుల ఇళ్లు రావు. పేదల కోసం కట్టిన ఇళ్లు కూలిపోతున్నాయి. నియోజకవర్గంలో 3,000 ఇళ్లకు ఆర్థిక సాయం అన్నారు. బడ్జెట్‌లో నిధులు అవాస్ యోజనకు కేటాయిస్తున్నాం. బడ్జెట్‌లోని నిధుల్లో రూ.10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కవితకు నిధులు ఇస్తే లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టారు. నా తల్లిదండ్రులను తిడితే.. నేను కవితను తిట్టకుండా ఊరుకోవాలా?." - అర్వింద్, ఎంపీ

కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు వెంటనే చేయాలంటూ.. రేపు ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కమలం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే రేపటి ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో భారతీయ జనతా పార్టీ నేతలు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటి బీజేపీ ధర్నాకు అనుమతి ఇచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు

ఇవీ చదవండి :Chintala Ramachandra Reddy fires BRS : "ఇళ్లనిర్మాణ నిధుల అక్రమాలపై.. త్వరలో జన్​సున్వాయి"

Kishan Reddy Arrest : కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details