అమీర్‌పేట కార్పొరేటర్‌గా భాజపా తరఫున ఇటీవల ఎన్నికైన సరళ ఆధ్వర్యంలో.. భాజపా కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులను మోసం చేసి.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సరళ ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని అందించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా చేపట్టిన వారిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'ఉద్యోగాలు ప్రకటించాలి.. నిరుద్యోగ భృతి ఇవ్వాలి'
పెండింగ్‌లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేసి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని కోరుతూ అమీర్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు.
'ఉద్యోగాల ప్రకటన చేయాలి... నిరుద్యోగ భృతి ఇవ్వాలి'