ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్, హైకోర్టు ఒత్తిడితోనే కేసీఆర్ దిగొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అడ్డుకోవటంతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నారని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసైని భాజపా ప్రతినిధుల బృందం కోరింది. కొందరు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
'కేంద్రం, గవర్నర్ ఒత్తిడి వల్లే కేసీఆర్ దిగొచ్చారు' - కేంద్రం, గవర్నర్ ఒత్తిడి వల్లే కేసీఆర్ దిగి వచ్చాడు: లక్ష్మణ్
గవర్నర్ తమిళిసైను భాజపా ప్రతినిధుల బృందం కలిసింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు చేపట్టాలని గవర్నర్ను కోరారు. కేంద్రం, గవర్నర్, హైకోర్టు ఒత్తిడితోనే ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి దిగొచ్చారని లక్ష్మణ్ తెలిపారు.
కేంద్రం, గవర్నర్ ఒత్తిడి వల్లే కేసీఆర్ దిగి వచ్చాడు: లక్ష్మణ్