BJP Deeksha: బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం... సభలోకి అనుమతించే అంశం పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ నేడు భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనుంది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు దీక్ష చేయనున్నారు. వారికి మద్దతుగా ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే.అరుణ, మురళీధర్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చోనున్నారు.
అనుమతి నిరాకరణ...