తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. టెస్టుల సంఖ్య పెంచాలి' - Bjp Deeksha

రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్రప్రభుత్వం హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలని భాజపా నాయకుడు ఓం ప్రకాశ్​ డిమాండ్​ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా చికిత్స అందించాలని కోరారు.

Bjp Deeksha At Gun foundry in Hyderabad
రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

By

Published : Jul 13, 2020, 7:30 PM IST

రాష్ట్రంలో కరోనా బాధితులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా ఆరోపించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... హైదరాబాద్ గన్ ఫౌండ్రిలోని పార్టీ కార్యాలయంలో భాజపా నాయకుడు ఓం ప్రకాశ్​ నిరాహారదీక్ష చేపట్టారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆక్సిజన్, వెంటిలేటర్లు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

కరోనా వైరస్ నియంత్రించకుండా... ప్రజల సొమ్మును నూతన భవనాలు కట్టేందుకు ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details