హైదరాబాద్లోని పాతబస్తీ కాశీబుగ్గ దేవాలయాన్ని రక్షించడానికి తమ వంతు కృషి చేస్తామని భాజపా గోషామహల్, కార్వాన్ ఇంఛార్జ్ పాండు యాదవ్ అన్నారు. అధికారులతో మాట్లాడి గుడి స్థలం కబ్జా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
'కాశీబుగ్గ దేవాలయ పరిరక్షణకు కృషి చేస్తాం' - Hyderabad News
హైదరాబాద్లోని కాశీబుగ్గ దేవాలయాన్ని భాజపాకు చెందిన ఏడుగురు కార్పొరేటర్లు దర్శించుకున్నారు. గుడి స్థలం కబ్జా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భక్తులను ఎంఐఎం కార్పొరేటర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాశీబుగ్గ దేవాలయం రక్షించుకుంటామన్న భాజపా కార్పొరేటర్లు
జియాగూడా సమర్థ కామధేను గోశాలలో దర్శనం తరువాత భాజపా ఏడుగురు కార్పొరేటర్లు పాదయాత్ర చేసుకుంటూ కాశీబుగ్గ దేవాలయం దర్శించుకున్నారు. భక్తులను స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికి తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.
ఇదీ చూడండి:జనగర్జన సభకు పార్టీ శ్రేణులు తరలి రావాలి: జానారెడ్డి